Published on Dec 5, 2024 6:00 PM IST
రీసెంట్ గా మన తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో సందీప్ సరోజ్, సుప్రాజ్ రంగ, తరుణ్ పొనుగంటి, హర్ష నర్రా, సోనియా ఠాకూర్, మేఘ లేఖ, నువేక్ష, ఖుష్బూ చౌదరి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు విక్రమ్ రెడ్డి తెరకెక్కించిన యూత్ ఫుల్ కామెడి అండ్ రొమాంటిక్ డ్రామా చిత్రమే “రోటి కపడా రొమాన్స్”. మరి గత వారమే థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం ఇపుడు ఓటిటిలో అలరించేందుకు సిద్ధం అయ్యింది.
ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా ఇపుడు వారి స్ట్రీమింగ్ డేట్ ని ఇచ్చేసారు. ఈ చిత్రాన్ని తాము డిసెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తెస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. సో ఓటిటిలో ఈ సినిమా మరింత ఆదరణ దక్కించుకునే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సృజన్ కుమార్, బెక్కం వేణు గోపాల్ నిర్మాణం వహించగా ఆర్ ఆర్ ధృవన్ అలాగే సన్నీ ఎం ఆర్ సంగీతం అందించారు.