Published on Dec 10, 2024 1:59 PM IST
మన టాలీవుడ్ మొదటి సూపర్ హీరో చిత్రం అలాగే మొదటి సూపర్ హీరో “హను మాన్” కోసం తెలిసిందే. యువ హీరో తేజ సజ్జ నటించిన ఈ భారీ చిత్రం తర్వాత తన నుంచి మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “మిరాయ్” వస్తున్న సంగతి తెలిసిందే. ఈగల్ సినిమాతో సత్తా చాటిన యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.
మరి ఈ సినిమాలో చాలా మంది స్టార్ నటులు స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ ఎడిషన్ సినిమాలో చేరినట్టుగా బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ సినిమాలో RRR నటి శ్రియ శరన్ కనిపించనున్నట్టుగా తెలుస్తుంది. శ్రీయ ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కి కనిపించనున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ కూడా తర్వాత రానుంది. ఇక ఈ చిత్రానికి హను మాన్ సంగీత దర్శకుడు గౌర హరి వర్క్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.