Published on Dec 2, 2024 3:08 PM IST
బాలీవుడ్ స్టార్ జంట అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకులు తీసుకుంటున్న వార్త చాలా రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఈ వార్తల నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ ఈ వార్తలు అవాస్తవం అని ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. తాజాగా అభిషేక్ బచ్చన్ మగవాళ్ళను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘మీ నటనతో విమర్శకులను ఎలా సైలెంట్ చేస్తున్నారు ?, అది ఎలా సాధ్యమవుతుంది’’ అని అభిషేక్ బచ్చన్‌ను హోస్ట్ ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నకు అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ.. ‘నిజం చెప్పాలంటే.. ఇది చాలా సాధారణమైన విషయం. నేను విమర్శలను పెద్దగా పట్టించుకోను. దర్శకులు చెప్పిన విధంగా చేసుకుంటూ వెళ్తాను. మన పనేదో మనం చేసుకొని సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోవడమే’’ అని చెప్పుకొచ్చారు. అభిషేక్ ఇంకా మాట్లాడుతూ.. ‘తమ పర్సనల్ లైఫ్ లో పెళ్లైన పురుషులు తమ భార్య మాట వినాలి’’ అని చెప్పడం విశేషం.