Published on Oct 15, 2024 12:30 AM IST
స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఆమె ప్రస్తుతం టాలీవుడ్‌లో చేస్తున్న సినిమా ‘డెకాయిట్’ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించింది. అయితే, ఈ సినిమా నుండి తాజాగా ఓ రూమర్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.
డెకాయిట్ సినిమా నుండి శ్రుతి హాసన్ తప్పుకున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్త వినిపిస్తోంది. చిత్ర యూనిట్‌తో ఆమెకు మనస్పర్థలు రావడంతోనే శ్రుతి ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. చిత్ర దర్శకుడితో ఆమెకు విభేదాలు తలెత్తాయని.. అందుకే ఆమె ఈ సినిమా నుండి వాకౌట్ చేసిందట. ఇక ఈ సినిమాలో హీరోగా అడివి శేష్ నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ లభించింది. అయితే, ఈ సినిమా నుండి శ్రుతి హాసన్ నిజంగానే వాకౌట్ చేసిందా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.