Published on Dec 18, 2024 12:00 AM IST
సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు కె.పి.రోహిత్ డైరెక్ట్ చేస్తుండగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావడంతో ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. రీసెంట్‌గా ఈ చిత్ర టైటిల్‌ను లాంచ్ చేశారు. ‘సంబరాల యేటి గట్టు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ పూర్తి మేకోవర్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో ఆయన బీస్ట్ మోడ్‌లోకి మారుతున్నాడు. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర కోసం సాయి దుర్గ తేజ్ జిమ్‌లో చెమటోడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్‌ను ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని మేకర్స్ ఇప్పటికే తెలిపింది.
ఇక ఈ సినిమాలో అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు.