మన టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోస్ లో తన మార్క్ ఇంట్రెస్టింగ్ సినిమాలతో అలరిస్తూ వస్తున్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకడు. ఇపుడు కూడా పలు ఆసక్తికర కథలతో భారీ ప్రాజెక్ట్ లు తాను చేస్తుండగా ఈ సినిమాల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి అనౌన్స్ అయ్యిన చిత్రం “ది ఇండియా హౌస్” చిత్రం కూడా ఒకటి.
మరి ఓ సాలిడ్ స్పై థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఈ చిత్రంలో నటిస్తుండగా నేడు తన బర్త్ డే కానుకగా మేకర్స్ ఆమె బర్త్ డే పోస్టర్ సహా తన రోల్ ని రివీల్ చేశారు.
అయితే ఈ చిత్రంలో ఆమె ‘సతీ’ గా కనిపిస్తుంది అని ఆమెపై ఒక బ్యూటిఫుల్ పోస్టర్ తో తెలిపారు. మరి సినిమాలో తన పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ తదితరులు నటిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అలాగే విమెగా పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
The post చరణ్, నిఖిల్ భారీ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రివీల్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.