
సౌత్ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి వరుసగా బ్లాక్‌బస్టర్ సినిమాలతో దూసుకుపోతున్నారు. గతేడాది ‘అమరన్’, ఈ ఏడాది ‘తండేల్’ చిత్రాలతో మరోసారి తన క్రేజ్‌ను పెంచుకున్నారు. అయితే తాజాగా సాయి పల్లవి గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అతిరన్ – భారీ అంచనాలు లేకపోయినా, అత్యద్భుతమైన కథతో తెరకెక్కిన ఓ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. 1970ల కాలం నాటి కేరళలోని ఓ మారుమూల మానసిక ఆరోగ్య కేంద్రంలో ఈ కథ నడుస్తుంది. ఫహద్ ఫాజిల్ (డాక్టర్ కె. నాయర్) ఓ దర్యాప్తు కోసం అక్కడికి వెళతాడు. కానీ, అక్కడ జరిగిన వింత సంఘటనలు, అదృశ్యమైన మిస్టరీలు అతడిని ఆశ్చర్యపరుస్తాయి.
ఈ ఆసుపత్రిలో నిత్య (సాయి పల్లవి) చీకటి గదిలో బంధించబడి ఉంటుంది. ఆమె ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉంటూ, కళ్లలో ప్రత్యేకమైన ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. ఆమెను అక్కడ ఎందుకు ఉంచారు? ఆమె నిజంగా మానసిక రోగినా? లేకుండా మరో సీక్రెట్ దాగి ఉందా? అన్నది సినిమా కథ. ఆమె ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తిగా, దాచివేయబడిన గూఢచారాన్ని సినిమా అద్భుతంగా ప్రదర్శిస్తుంది.
మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా విడుదల సమయంలో పెద్దగా స్పందన పొందలేదు. కానీ, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఇప్పుడు జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.