ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ సలార్ జపాన్ రిలీజ్ కు రెడీ అవుతోంది. జూలై 7వ తేదీ నుంచి ఈ సినిమా అక్కడి థియేటర్స్ లో సందడి చేయనుంది. సలార్ రెండు సినిమాల్లో ఫస్ట్ పార్ట్ సలార్ సీజ్ ఫైర్ గతేడాది డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు.Prabhas starrer Salaar: Part 1: Ceasefire is all set for its release in  Japan this summer! : Bollywood News - Bollywood Hungama

ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ మరో కీ రోల్ చేశారు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 700 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ప్రభాస్ కు జపాన్ లో ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఆయన బాహుబలి సినిమా జపాన్ లో మంచి ఆదరణ పొందింది. ప్రభాస్ బర్త్ డేను జపాన్ ఫ్యాన్స్ నిర్వహిస్తుంటారు. సలార్ సినిమాకు కూడా జపాన్ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలోనే సలార్ 2 శౌర్యాంగ పర్వ సెట్స్ మీదకు వెళ్లనుంది.