పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “సలార్” కోసం తెలిసిందే. మరి నేటితో ఈ సినిమా వచ్చిన ఏడాది పూర్తయ్యింది. అయితే ఈ ఏడాది కంప్లీట్ అయ్యిన నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ నుంచి వచ్చిన పలు కామెంట్స్ వైరల్ గా మారుతూ వస్తున్నాయి.
అయితే వీటిలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్నకి సమాధానం పార్ట్ 2 లో దొరుకుతుంది అని నీల్ చెబుతున్నాడు. పార్ట్ 1 లో ప్రభాస్ ఒక ప్లాస్టిక్ కత్తి పట్టుకున్నప్పుడు తన తల్లి వార్నింగ్ ఇచ్చి కత్తి వదలమంటుంది. అయితే ఆ సీన్ కోసం మంది అప్పుడు ఇదే సమయంలో మాట్లాడుకున్నారు. అయితే మరీ ప్లాస్టిక్ కత్తికే ఇంత రియాక్షన్ ఉండాలా అంటూ చాలా మంది అనుకున్నారు కానీ దీనికి సమాధానం పార్ట్ 2 లో దొరుకుతుంది అని ప్రశాంత్ నీల్ తెలిపాడు. మరి దీనిపై నీల్ ఏం చూపిస్తాడో చూడాలి.
The post “సలార్ 2″లో ఈ ప్రశ్నకి సమాధానం అంటున్న నీల్.. first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.