
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ రెడీ అయ్యింది! ఇప్పటికే “స్పిరిట్” ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ సిద్ధమవుతుండగా, మరోవైపు “సలార్” మేకర్స్ ఓ భారీ అప్‌డేట్ ఇచ్చారు. బ్లాక్‌బస్టర్ “సలార్” సినిమాను మళ్లీ రీరిలీజ్ చేయబోతున్నారు.
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన “సలార్” సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించి, పాన్-ఇండియా హిట్‌గా నిలిచింది. మొదట్లో మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, తర్వాత సూపర్ హిట్ అయింది. “కేజీఎఫ్ 1, 2” వంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ సినిమాకు అభిమానుల నుంచి ఊహించని పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు, రెండో భాగం షూటింగ్ ప్రారంభానికి ముందు “సలార్” ను మరోసారి వెండితెరపైకి తీసుకురానున్నారు.
ఈ రీరిలీజ్ తేదీగా మార్చి 21 ఫిక్స్ చేశారు. ఈ అప్‌డేట్‌తో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటెడ్! ప్రశాంత్ నీల్ భార్య కూడా ఈ రీరిలీజ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. మరోసారి బిగ్ స్క్రీన్ పై ప్రభాస్ పవర్ ఆస్వాదించడానికి రెడీగా ఉండండి.