- బేబీ బంప్‌తో సమంత
- వైరల్ అవుతున్న ఫోటోలు
- గతంలో కూడా ప్రెగ్నెంట్ అంటూ తప్పుడు ప్రచారం
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అందం, అభినయంతో టాలీవుడ్ ను కొన్నేళ్ల పాటు షేక్ చేసింది. టాలీవుడ్, కోలీవుడ్ లోని స్టార్ హీరోల అందరి సరసన నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఏమాయ చేశావే సినిమాతో అందర్నీ ఆకట్టుకుంది. తాజాగా సమంత కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ పెళ్లి, విడాకుల తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా మారింది సమంత. తాజాగా సమంత బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read Also:Kamareddy Crime: వీడిన త్రీ సూసైడ్స్ మిస్టరీ.. అందుకే ఆ ముగ్గురు మృతి..
నాగ చైతన్యతో విడాకుల తర్వాత తనకు మాతృత్వాన్ని అనుభవించాలన్న కోరిక ఉందని అప్పట్లో సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అప్పట్లో ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెగ వైరల్ అయింది. ఇప్పుడు సమంత బేబీ బంప్ ఫోటోలను చూసిన వారంతా ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు అంది.. ఇప్పుడు నిజం చేసుకుందా అని కామెంట్స్ పెడుతున్నారు. సమంత బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే సమంత నిజంగా ప్రెగ్నెంట్ కాదు. ఇవి ఎవరో కావాలని చేసిన పని. ఏఐని ఉపయోగించి సమంత బేబీ బంప్ ఫోటోలను క్రియేట్ చేశారు. ఇదేం కొత్త కాదు. గతంలో కూడా సమంత ప్రెగ్నెంట్ అంటూ తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు సమంత బేబీ బంప్ ఫొటోలను క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియాలో వదిలారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Read Also:Jailer : జైలర్ 2 కోసం కేజీఎఫ్ అందాల గనిని దింపుతున్న నెల్సన్