Thiru Manickam : క్రిస్మస్ కానుకగా సముద్రఖని సినిమా రిలీజ్

  • తిరు మాణిక్యం ట్రైలర్ ఔట్
  • డిసెంబర్ 27న మూవీ రిలీజ్
  • క్రైమ్‌ థ్రిల్లర్‌గా తిరు మాణిక్యం

టాలీవుడ్ లో ఇయర్ ఎండింగ్ సినిమాలకు క్రిస్మస్ మాంచి సీజన్ల మారిపోయింది. కోలీవుడ్‌లో కూడా ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. డిసెంబర్ 20న విడుదల 2 రిలీజ్ అవుతుండగా  మరో మూవీ ఇయర్ ఎండింగ్ పై కాన్సంట్రేషన్ చేసింది.  కోలీవుడ్ డైరెక్టర్లకు మెగా ఫోన్‌ కంటే యాక్టింగ్ పై కాస్తంత ఇంట్రెస్టెట్ ఎక్కువౌతోంది. సీనియర్ నటుడు భారతీరాజా దగ్గర నుండి ఎస్ జే సూర్య వరకు కట్, యాక్షన్‪కు పేకప్ చెప్పి తెరపై కనిపించడంలో బిజీ అవుతున్నారు. ఈ లిస్టులో ఎప్పుడో చేరిపోయాడు సముద్ర ఖని. రీసెంట్ టైమ్స్‌లో బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఛేంజైన ఈ స్టార్ డైరెక్టర్.. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ ని టార్గెట్ చేస్తున్నాడు.

తిరు మాణిక్యంగా ప్రేక్షకులను పలకరించబోతున్నాడు సముద్ర ఖని. చాలా గ్యాప్ తర్వాత ఓ రెస్పాన్సిబుల్ ఫాదర్ క్యారెక్టర్‌ ప్లే చేస్తున్నాడు. ఇందులో కేరళ కుట్టీ అనన్య ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించబోతుంది. రీసెంట్లీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో సీనియర్ స్టార్ డైరెక్టర్ భారతీ రాజా, నాజర్, శ్రీమాన్, తంబి రామయ్య, వడివుక్కరసి, ఇళవరసు లాంటి సీనియర్ కాస్ట్ యాక్ట్ చేస్తున్నారు. తండ్రి సమస్యలో చిక్కుకోవడంతో ఓ అందమైన కుటుంబంలో ఎలాంటి అలజడి రేగింది.  జీవితాలు ఎలా తల్లకిందులయ్యిందే ఈ సినిమాలో చూపించబోతున్నాడు డైరెక్టర్ నంద పెరియ స్వామి. విశాల్ చంద్ర శేఖర్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీ డిసెంబర్ 27న థియేటర్లలోకి రాబోతుంది. ఇటు క్రిస్మస్ ఇటు ఇయర్ ఎండింగ్ లాంగ్ వీకెండ్ టార్గెట్ చేస్తూ మూవీని తీసుకువస్తున్నారు మేకర్స్.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *