తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియాకు చేరిన నేపథ్యంలో ఇక్కడి హీరోలు, హీరోయిన్స్ కు బాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కుతోంది. తెలుగు నుంచి కాజల్, తమన్నా, పూజా హెగ్డే లాంటి హీరోయిన్స్ హిందీలో సినిమాలు చేశారు. ఇప్పుడు హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఆమె తన మొదటి హిందీ సినిమాను ప్రకటించబోతోంది. రీసెంట్ గా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లింది సంయుక్త మీనన్.

ఎయిర్ పోర్ట్ లో మీడియా ఆమెను స్టిల్స్ తీసింది. సంయుక్త న్యూ మేకోవర్ లో ఉన్న ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హిందీ సినిమా కన్ఫర్మ్ చేసుకునేందుకే ఆమె ముంబై వెళ్లినట్లు తెలుస్తోంది. భీమ్లా నాయక్ తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన మలయాళ హీరోయిన్ సంయుక్త మీనన్..ఇక్కడ బింబిసార, విరూపాక్ష, సార్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసింది. ఇప్పుడు నిఖిల్ సరసన స్వయంభు అనే పాన్ ఇండియా మూవీతో పాటు శర్వానంద్ కొత్త సినిమాలోనూ నటిస్తోంది.