Sandeep Reddy Vanga Slams Deepika’s PR Team Over Spirit Leak: "Is This Your Feminism?"
Sandeep Reddy Vanga Slams Deepika’s PR Team Over Spirit Leak: "Is This Your Feminism?"

యానిమల్ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్పిరిట్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా కథను దీపికా పదుకొణె పీఆర్ టీమ్ లీక్ చేసిందన్న వార్తలపై డైరెక్టర్ సందీప్ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు.

“నా దగ్గర స్టోరీ వినిపించిన ప్రతీ నటిపై నేను 100 శాతం నమ్మకం ఉంచుతాను. అది ఒక అనునయ NDA లాంటిదే. కానీ ఇప్పుడు మీరు కథను లీక్ చేయడమే కాదు, ఒక యంగ్ నటిని కిందకు లాగుతున్నారు. ఇదేనా మీ ఫెమినిజం?” అంటూ సందీప్ ట్వీట్ చేశారు. దీని ద్వారా త్రిప్తి డిమ్రీపై వస్తున్న విమర్శలపైనా ఆయన సపోర్ట్ గానే భావిస్తున్నారు నెటిజన్లు.

ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ముఖ్యంగా “This is what your feminism stands for?” అనే వాక్యం పెద్ద చర్చకే దారి తీసింది. మరొకవైపు, స్పిరిట్ కథలో వాస్తవంగా ఏం లీక్ అయిందన్నదానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఇక త్రిప్తి డిమ్రీ ఈ మూవీలో నటించనుండగా, దీపికను ఎందుకు రీప్లేస్ చేశారన్నది ఇంకా స్పష్టంగా బయటకు రాలేదు. అయితే ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే ఈ కథ చుట్టూ ఇంకా ఎన్నో వివాదాలు చుట్టుకుంటాయనడంలో సందేహం లేదు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *