హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కు కారణమైన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఇప్పుడు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. పోలీసులు ముందు నుంచి సంధ్య థియేటర్ యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని చెబుతూ వచ్చారు. కానీ ప్రీమియర్ షో కి రెండు రోజుల ముందే అంటే రెండవ తేదీన అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ ఉండే అవకాశం ఉండడంతో పోలీసు భద్రత కోరుతూ సంధ్య థియేటర్ పోలీసులకి రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Allu Arjun: హీరో అల్లు అర్జున్ అరెస్ట్.. మినిట్ టు మినిట్ ఏమైంది?
ఈ లేఖ ప్రకారం అసలు సంధ్య థియేటర్ ది కానీ అల్లు అర్జున్ ది కానీ తప్పు లేదని పూర్తిస్థాయిలో భద్రత కల్పించలేని పోలీసులదే తప్పని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులో అల్లు అర్జున్ సహా సంధ్య థియేటర్ యాజమాన్యానిదే తప్పు అంటూ చెబుతూ వస్తున్నారు. మరోపక్క ఈ కేసులో అల్లు అర్జున్ ని 11వ నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు, అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ మీద ప్రస్తుతానికి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.