Sankranthiki Vasthunnam OTT Release Update
Sankranthiki Vasthunnam OTT Release Update

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయాన్ని సాధించింది. కుటుంబ కథా చిత్రం గా వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి నటన, చిన్నారి బుల్లిరాజు కామెడీ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ, టీవీ రిలీజ్‌పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జీ5 సంస్థ డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. అయితే టీవీలో ముందుగా టెలికాస్ట్ చేయనున్నట్లు జీ తెలుగు ప్రకటించింది. ఇప్పటికే ‘త్వరలోనే టీవీలో సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యాయి.

అంతేకాకుండా, జీ5 ఇటీవల ట్విట్టర్‌లో ఒక ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసింది – “ఏమండోయ్! వాళ్లు వస్తున్నారు. మరిన్ని వివరాలకు వేచి చూడండి.” ఈ పోస్ట్ చూసిన అభిమానులు, త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని అంచనా వేస్తున్నారు.

మరి ముందు టీవీలో వస్తుందా? లేక ఓటీటీలో విడుదల అవుతుందా? అనేది ఆసక్తికరమైన విషయం. ఎక్కడ చూసినా సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తుందని మాత్రం చెప్పాలి!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *