టాలీవుడ్లో సెలబ్రిటీల పై విమర్శలు మరింత పెరిగిపోయాయి. వారి వ్యక్తిగత జీవితం, కుటుంబాలు కూడా ఇప్పుడు నెటిజన్ల దృష్టిలో నిలబడుతున్నాయి. ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కూతురు శాన్వి పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ, శాన్వి పై ఎందుకు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? ఆమె ఏం తప్పు చేసింది?
ఇటీవల జీ కన్నడ ‘సరిగమప’ షోలో కిచ్చా సుదీప్, ఆయన భార్య ప్రియ, కూతురు శాన్వి కలిసి సందడి చేశారు. ఈ సందర్భంగా శాన్వి తన తండ్రి కోసం ఒక పాటను రాగంతో ఆలపించింది. కానీ పాట తర్వాత శాన్వి ఆంగ్లంలో మాట్లాడటం పెద్ద వివాదం సృష్టించింది. ఆమె “ప్రతివర్ష” అనే పదం తప్ప ఇంకో కన్నడ పదం ఉపయోగించలేదు. అదే ఇప్పుడు శాన్వి పై ట్రోలింగ్ కి కారణమైంది.
ఇంతకుముందు కిచ్చా సుదీప్, కన్నడ బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. తన షోలో కంటెస్టెంట్స్ ఇంగ్లిష్ మాట్లాడొద్దని, కన్నడ భాషలో మాట్లాడాలని తరచూ చెబుతున్నాడు. ఇలాంటి సమయంలో తన కూతుర్ని కన్నడలో ఎందుకు మాట్లాడించలేదని, సుదీప్ ను నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
కానీ కొందరు సుదీప్, శాన్వి ని సపోర్ట్ చేస్తూ, శాన్వి కన్నడ భాషలో పాడిన పాట అద్భుతం అని చెప్పుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై కన్నడ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు సుదీప్ ఈ వివాదంపై క్లారిటీ ఇస్తాడా? అన్నది చూడాలి.