Published on Nov 21, 2024 2:07 PM IST
రీసెంట్ గా మ్యూజిక్ లవర్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ సంగీత దర్శకుల్లో తన క్రేజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టిన సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ కూడా ఒకరు. మరి జేక్స్ నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రమే “సరిపోదా శనివారం”. నాచురల్ స్టార్ నాని హీరోగా ఎస్ జె సూర్య విలన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సాలిడ్ చిత్రానికి తన మాస్ మ్యూజిక్ తో జనాన్ని ఇంకా థియేటర్స్ కి రప్పించాడు.
మరి ఈ సంగీత దర్శకుని నుంచి ఇంట్రెస్టింగ్ గా ఇపుడు ఒకే రోజు మూడు భాషల్లో మూడు సినిమాలు రిలీజ్ కి వస్తుండడం గమనార్హం. మరి మన తెలుగు నుంచి మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన “మెకానిక్ రాకీ” వస్తుండగా ఈ సినిమా కాకుండా అటు తమిళ్ నుంచి “నిరంగల్ మూండ్రు” అలాగే మళయాళ సినిమా నుంచి “హెల్లొ మమ్మి” అనే మూడు సినిమాలు వస్తున్నాయి. దీంతో తాను కంపోజ్ చేసిన మూడు సినిమాలు మూడు వేరే వేరే భాషల్లో ఒకే రోజు విడుదలకి వస్తుండడం థ్రిల్లింగ్ గా ఉంది అంటూ తాను ఎగ్జైట్ అవుతున్నాడు.
????✨ What a day to remember! So thrilled that 3 movies I scored for are hitting the big screens today in 3 different languages! ????????
•#NirangalMoondru (Tamil)
•#HelloMummy (Malayalam)
•#MechanicRocky (Telugu) pic.twitter.com/qI5dPad0R6— Jakes Bejoy (@JxBe) November 21, 2024