
ఆహా ఓటీటీలో హిట్ అయిన వెబ్ సిరీస్ “త్రీ రోజెస్” ఇప్పుడు రెండో సీజన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సీజన్‌కి కూడా మాస్ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎస్‌కేఎన్ నిర్మాతగా, మారుతి షోరన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సిరీస్ లో ఈషా రెబ్బా, హర్ష చెముడు, సత్య, ప్రిన్స్ సిసిల్, హేమ, కుషిత కల్లపు, సత్యం రాజేశ్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలను కిరణ్ కె. కరవల్ల చేపట్టగా, రవి నంబూరి, సందీప్ బొల్ల రచన చేశారు.
తాజాగా ప్రమోషన్లలో భాగంగా మే 27న విడుదలైన ‘బెట్టింగ్ భోగి’ క్యారెక్టర్ గ్లింప్స్ యూ ట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ పాత్రలో నటించిన సత్య హిలేరియస్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్స్ చేసే ఓ వ్యసనపరుడి పాత్రలో కనిపించే సత్య “నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ వా?”, “కెరీర్ మీద కాస్త ఫోకస్ చెయ్య్” వంటి డైలాగులతో యూత్‌ను హత్తుకుంటున్నాడు.
ఈ సిరీస్‌లో రాశీ సింగ్ భర్తగా సత్య నటించగా, వారి మధ్య సీన్స్ పక్కా ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందించబోతున్నాయి. నిజజీవితంలో చూసే స్నేహితుల క్యారెక్టర్స్‌ను గుర్తు చేసేలా ఈ పాత్ర డిజైన్ చేయడం విశేషం. ప్రస్తుతం సత్య రాజా సాబ్, పెద్ది, విశ్వంభర వంటి సినిమాల్లో బిజీగా ఉన్నా, త్రీ రోజెస్ 2 కోసం ప్రత్యేకంగా టైమ్ కేటాయించడమే ఈ ప్రాజెక్టుపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది.
ఇటీవలే విడుదలైన ఈ క్యారెక్టర్ గ్లింప్స్ వీడియో యూట్యూబ్‌లో మంచి ట్రెండ్ అవుతోంది. ‘త్రీ రోజెస్’ సీజన్ 2 త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్‌కు రాబోతోంది, మరింత ఫన్‌కి రెడీ అవ్వండి!