
ప్రస్తుతం ఓటీటీలో హారర్ సినిమాలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండగా, ట్రెండింగ్ లో హారర్ జోనర్ చిత్రాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ప్రేక్షకులు భయపడుతూనైనా హారర్ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. ఇప్పుడు ఓటీటీలో ఒక భయానక హారర్ చిత్రం ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో పది భాషల్లో విడుదల అయింది. ఒంటరిగా చూడకపోవడమే మంచిది అని సినీ ప్రేమికులు చెబుతున్నారు.
ఈ కథలో నలుగురు స్నేహితులు ఒక అడవిలో కారుతో ప్రయాణిస్తారు. అనుకోకుండా వారి వాహనం చెట్టును ఢీ కొడుతుంది. ఊహించని విధంగా వారు ఒక వుడెన్ హౌస్ కనిపిస్తారు. ఇంటి లోపల అలజడి కలిగించే బొమ్మలు కనిపిస్తాయి. అయితే ఆ బొమ్మలకు కొన్ని భాగాలు ఉండవు. కళ్లు, చెవి, నోరు లేకుండా భయంకరంగా కనిపిస్తాయి. బదులుగా మనుషుల అవయవాలు అతికించి ఉంటాయి.
ఆ బొమ్మల వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే క్రమంలో వారు ఊహించని భయానక పరిస్థితులను ఎదుర్కొంటారు. అక్కడ కొంతమంది ముసుగు వ్యక్తులు తాంత్రిక పూజలు చేస్తుంటారు. వారు ఎవరూ? ఆ బొమ్మలకు సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో భయానక ట్విస్ట్ లతో తెలుస్తాయి.
ఈ సినిమా క్లాసిక్ హారర్ స్టోరీగా ప్రేక్షకులను ఓటీటీలో భయపెడుతుంది. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు తప్పక చూడాల్సిన హారర్ మూవీ ఇది. అయితే, ఈ సినిమాను ఒంటరిగా చూడకపోవడమే మంచిది!