SDT 18 : సాయిదుర్గ తేజ్ ఊచకోత చూస్తారు : రామ్ చరణ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తాజా చిత్ర కార్నేజ్‌ లాంచ్ ఈవెంట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్  పాల్గొన్నారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ కి, అలాగే మేము ఎంతగానో గుండెల్లో పెట్టుకొని ప్రేమించే మా అభిమానులందరికీ పేరుపేరునా నమస్కారం. ముందుగా తేజ్ కి కంగ్రాచ్యులేషన్స్. ఒక ఫైటర్ లా ఈ టెన్ ఇయర్స్ ని పూర్తి చేశాడు. ఇది బ్యూటిఫుల్ జర్నీ. తేజ్ ఒక మంచి యాక్టర్ మాత్రమే కాదు మంచి వ్యక్తి. . మీ అందరి సపోర్ట్ వల్లే తను ఇక్కడ ఉన్నాడు.

Also Read : Game Changer : ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా సుకుమార్‌

తేజు ఈరోజు ఇక్కడ ఎలా నిలిచి ఉండటానికి కారణం అభిమానుల బ్లెస్సింగ్స్. ఇది తనకి పునర్జన్మ. ఈ జన్మ అభిమానులే ఇచ్చారు. ఆ సమయాన్ని మళ్లీ గుర్తు చేసుకోవాలని నాకు లేదు. కానీ ఆ మూడు నెలలు మాకు చాలా కష్టమైన సమయం. అంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత తేజు మళ్లీ ఇక్కడ నిల్చున్నాడు అంటే తిను మా తేజ్ కాదు మీ తేజు. మీ అందరికీ తేజ్ తరఫున, మా విజయ అక్క తరపున పేరుపేరునా ధన్యవాదాలు. ఇది తేజుకి 18 ఫిల్మ్. సంబరాల ఏటిగట్టు. అందరికీ ఒకటే మాట చెబుతున్నా. తేజు ఊచకోత ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూడబోతున్నారు. ఔట్ స్టాండింగ్ విజువల్స్. రోహిత్ గారికి ప్రత్యేకంగా థాంక్స్ చెప్తున్నాను. తేజు ప్రేమ చాలా బండ ప్రేమ. ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు. అంత గట్టిగా ప్రేమిస్తాడు. ఈ సినిమాతో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మంచి న్యూస్ కూడా వినిపించాలని కోరుకుంటున్నాను. థాంక్యూ. లవ్ యూ ఆల్’ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *