‘మ్యాడ్ స్క్వేర్’ సెకండ్ సింగిల్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్‌లో తెరకెక్కిన మ్యాడ్ చిత్రం యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ కావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతోంది.

‘మ్యాడ్ స్క్వేర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తొలిభాగంలో నటించిన రామ్ నితిన్, నార్నె నితిన్, సంగీత్ శోభన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సీక్వెల్ మూవీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా, ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను అందుకుంది.

అయితే, తాజాగా ఈ సినిమా నుండి రెండో సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘ది మ్యాడెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా రాబోతున్న ఈ పాటను డిసెంబర్ 28న సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈమేరకు ఓ సరికొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The post ‘మ్యాడ్ స్క్వేర్’ సెకండ్ సింగిల్ సాంగ్‌కు టైమ్ ఫిక్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *