
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరోసారి రీ-రిలీజ్ కాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మహేష్ కామెడీ టైమింగ్, వెంకీ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్గా నిలిచాయి. సమంత, అంజలి, జయసుధ, ప్రకాష్ రాజ్ వంటి టాలెంటెడ్ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేశ్ పాత్రల పేర్లకు వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. మొదట వెంకటేశ్ పాత్రకు మల్లికార్జున, మహేష్ పాత్రకు సీతారామరాజు అనే పేర్లు పెట్టాలని దర్శకుడు భావించాడు. కానీ, అంజలి పాత్ర పేరు సీత కావడంతో సందిగ్ధత నెలకొంటుందని టీమ్ భావించింది. చివరకు వీరికి “పెద్దోడు – చిన్నోడు” అనే నేమ్స్ ఫిక్స్ చేశారు. సినిమా విడుదలై దశాబ్దమైనా ఇప్పటికీ ప్రేక్షకులు టీవీలో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు.
ఈ సినిమాను మార్చి 7, 2025న రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో మహేష్ బాబు & వెంకటేశ్ ఫ్యాన్స్ లో సూపర్ ఎక్సయిట్మెంట్ కనిపిస్తోంది. మరోసారి సినిమా థియేటర్స్లో సందడి చేయడానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు.
ఇక మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్-గ్లోబల్ మూవీ చేస్తున్నారు. మరోవైపు, వెంకటేశ్ ఇటీవల సంక్రాంతికి “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో హిట్ అందుకున్నారు. మరి, మహేష్ & వెంకీ కలయికలో మరో సినిమా రాదా? అనేది చూడాలి.