Published on Dec 28, 2024 12:01 PM IST
మన తెలుగు స్మాల్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది అంతా బిగ్ బాస్ అనే చెబుతారు. మరి గత కొన్నేళ్ల నుంచి సాగుతూ వస్తున్న ఈ రియాలిటీ షోకి తెలుగు వెర్షన్ లోనే ఇండియా వైడ్ గా మంచి రెస్పాన్స్ ఉంది. అలా ఇపుడు వరకు మొత్తం 8 సీజన్లను మేకర్స్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయగా లేటెస్ట్ గా బిగ్ బాస్ 8 కి సంబంధించి ఫైనల్ ఎపిసోడ్ తాలూకా రికార్డులు బయటకి టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ షోకి హోస్ట్ గా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
మరి తాను బిగ్ బాస్ 8 ఫైనల్ ఎపిసోడ్ ని స్ట్రీమింగ్ యాప్ హాట్ స్టార్ లో ఏకంగా 23 మిలియన్ మందికిపైగా చూశారట. అలాగే ఆ ఒక్క ఎపిసోడ్ కి 2 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్ కూడా నమోదు అయినట్టుగా నాగ్ తెలిపారు. దీనితో బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ భారీ హిట్ అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ క్రేజీ ఎపిసోడ్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే.