తమిళ స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. ఇటీవల సేతుపతి నటించిన ‘ మహారాజా’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా కాసుల వర్షం కురిపించింది. తొలిసారి విజయ్ సేతుపతిని వంద కోట్ల హీరోగా మార్చింది మహారాజా. నీతిలన్ స్వామి నాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా రాబట్టింది. తాజాగా ఈ సినిమాను చైనా భాషలో రీమేక్ చేయగా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి వంద కోట్లు కలెక్ట్ చేసింది. తాజాగా సేతుపతి నటించిన విడుదల థియేటర్స్ లో రిలీజ్ అయి హిట్ టాక్ తో రన్ అవుతోంది.
అదే జోష్ లో సేతుపతి మరొక మాస్ యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. యాక్షన్ సినిమాలకు పేరొందిన హరి దర్శకత్వంలో విజయ్ సేతుపతి ఓ సినిమా చేయనున్నాడట. ఇద్దరి మధ్య ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని కూడా సమాచారం. అయితే ఈ సినిమాను లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మించనుందట. నయన్ సొంత బ్యానర్ రౌడీ పిచ్చర్స్ పై నిర్మించనుందట. ఇప్పటి వరకు మిడ్ రేంజ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న నయన్ తొలిసారిగా ఓ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించనుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలోనే ఉందని అన్ని వివరాలు త్వరలోనే వివరిస్తామని అంటున్నాయట నయన్ నిర్మాణ సంస్థ వర్గాలు.