
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఏం చేసినా అది ట్రెండ్ అవుతుందంటే అతని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే అట్లీ దర్శకత్వంలో వచ్చిన “జవాన్” మూవీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన షారుఖ్, ప్రస్తుతం తన కొత్త సినిమా పనులతో బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా ఉన్న షారుఖ్ కమర్షియల్ యాడ్స్‌తోనూ కెమెరా ముందే కనిపిస్తున్నారు. కానీ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోన్న విషయం ఏంటంటే – 59 ఏళ్ల వయసులోనూ అతను 25 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాడు!
తన సిక్స్‌ప్యాక్, ఎనర్జీ, యంగ్ లుక్ వెనక రహస్యం ఏమిటి అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువైంది. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ తన డైట్ ప్లాన్‌ను వెల్లడించారు. “నాన్నగారు రోజుకు రెండుసార్లు మాత్రమే తింటారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేసి మధ్యాహ్నం, రాత్రి మాత్రమే భోజనం చేస్తానంటారు. Junk food కు దూరంగా ఉండటమే కాదు, sprouts (మొలకెత్తిన ధాన్యాలు), grilled chicken, broccoli లాంటి healthy food intake నే ఎక్కువగా చేస్తానని చెప్పారు.”
అంతేకాకుండా, అతిథుల ఇళ్లకు వెళ్లినప్పుడు వారు ఇచ్చే బిర్యానీ, నెయ్యి, రోటీ, లస్సీ వంటి ఏ వంటకానైనా తిరస్కరించకుండా తీసుకుంటానని చెప్పారు. “ఆహారంపై నియమాలు పాటించను కానీ శ్రద్ధగా తింటాను” అని షారుఖ్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.