ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ చేసింది. ఈ పాటలో శ్రీలీల – బన్నీ స్టెప్స్ బాగా అలరించాయి. అటు బన్నీ – శ్రీలీల కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. మొత్తానికి ఈ పాటతో శ్రీలీలకి సరికొత్త గుర్తింపు వచ్చింది. ‘పుష్ప 2’లో ఐటెం సాంగ్ చేయాలని శ్రీలీలను అడిగిన వెంటనే ఆలోచించకుండా ఓకే చెప్పింది.
ఐతే, ఇక పై శ్రీలీల ఐటెం సాంగ్స్ కి నో చెబుతుందట. తనకు ఐటెం సాంగ్ సెట్ కాదు అని, కాబట్టి.. ఐటమ్ సాంగ్ కోసం తనను సంప్రదిస్తే కచ్చితంగా నో చెబుతాను అంటూ శ్రీలీల క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల, నితిన్ హీరోగా వస్తున్న ‘రాబిన్ హుడ్’ సినిమాను చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమాపై శ్రీలీల చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్ అయితే, శ్రీలీల నెక్స్ట్ రేంజ్ కి వెళ్తుంది. అప్పుడు శ్రీలీలకి ఐటమ్ సాంగ్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
The post ‘రాబిన్ హుడ్’ పైనే ఆమె ఆశలన్నీ ! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.