షాకింగ్.. విశాల్ కి ఏమయ్యింది? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Jan 5, 2025 11:02 PM IST

తమిళ్ సినిమా సహా తెలుగులో కూడా బాగా తెలిసిన కోలీవుడ్ హీరోస్ లో యాక్షన్ హీరో విశాల్ కూడా ఒకరు. మరి విశాల్ నటించిన చిత్రం “రత్నం” తో గత ఏడాది పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఈ సంక్రాంతికి తాను నటించిన 12 ఏళ్ళు కితం చిత్రం “మద గజరాజ” సినిమాతో రాబోతున్నాడు.

అయితే ఈ సినిమా ఈవెంట్ లో లేటెస్ట్ గా విశాల్ పాల్గొనగా తనపై కొన్ని షాకింగ్ విజువల్స్ ఇపుడు వైరల్ గా మారుతున్నాయి. అయితే ఇందులో విశాల్ చాలా బక్క చిక్కిపోయి కనిపిస్తున్నాడు. ఇన్ని రోజులు ఎంతో ఫిట్ గా కనిపించిన విశాల్ ఇలా కనిపించడం తమిళ్ ఆడియెన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు యువతకి కూడా షాకింగ్ గా మారింది.

ఇంతకంటే షాకింగ్ అంశం ఏమిటంటే విశాల్ కనీసం సరిగ్గా మాట్లాడలేకపోవడం మైక్ పట్టుకొని ఉన్నపుడు తన చేయి కూడా వణకడం క్లియర్ గా కనిపిస్తుంది. దీనితో అసలు విశాల్ కి ఏమయ్యింది అనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం విశాల్ తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నాడని పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మాత్రం విశాల్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి కోలుకోవాలని నెటిజన్స్ కోరుకుంటున్నారు. మరి విశాల్ మళ్ళీ మునుపటిలా ఎనర్జెటిక్ గా తిరిగి రావాలని కోరుకుందాం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *