Allu Arjun : బెయిల్ వచ్చినా అల్లు అర్జున్ ఈరోజు జైల్లోనే ఉండాలా?

  • అల్లు అర్జున్ ను వెంటనే విడుదల చేయ్యాలని హైకోర్టు ఆదేశం
  • వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు ఆదేశం
  • 50 వేలు షూరిటీ సమర్పించాలని హైకోర్టు ఆదేశం
  • జైలు సూపర్ డెంట్ వెంటనే అల్లు అర్జున్ ను విడుదల చేయాలి:హైకోర్టు

అల్లు అర్జున్ కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. 50వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తు మీద ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. వ్యక్తిగత పూచీకత్తు బాండ్ తీసుకుని అల్లు అర్జున్ ను విడుదల చేయాలని చంచల్గూడా జైల్ సూపరింటెండెంట్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టు కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో అల్లు అర్జున్ ను చంచల్గూడా జైలుకు తరలించారు పోలీసులు దీంతో ప్రస్తుతానికి చంచల్గూడా జైల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. అయితే హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు అనంతరం ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్ కు వర్తించవని యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను ఆయనకు నిరాకరించలేమని హై కోర్టు తేల్చి చెప్పింది.

Allu Arjun: చంచల్గూడ జైలులోకి వెళ్లిన వెంటనే అల్లు అర్జున్ కి బెయిల్

అల్లు అర్జున్కి కూడా జీవించే హక్కు ఉందని పేర్కొన్న హైకోర్టు, నటుడు అవడం వల్ల పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్కి నేరాలు ఆపాదించాలా అంటూ ప్రశ్నించింది. మాకు మృతురాలు కుటుంబం పై సానుభూతి ఉంది, అంత మాత్రాన నేరాన్ని ఒకరిపైన రుద్దలేమని హైకోర్టు తేల్చింది. గతంలో జరిగిన ఆర్నాబ్ గోస్వామి వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వ కేసును ప్రస్తావించిన జడ్జి ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతేకాక రెగ్యులర్ బెయిల్ కోసం క్రింది కోర్టును ఆశ్రయించాలని అల్లు అర్జున్ కి సూచనలు చేసింది. ఈ కేసు విచారణకు సహకరించాలని కూడా సూచనలు చేసింది. విచారణలో జోక్యం చేసుకోవద్దని సాక్షులను ప్రభావితం చేయవద్దని, హైకోర్టు ఆదేశించింది. అయితే సాధారణంగా పైకోర్టులో బెయిల్ వస్తే ఆ బెయిల్ పేపర్ ను కింది కోర్టులో సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత జైల్లో బెయిల్ లభిస్తుంది కానీ ఇది ప్రత్యేక కేసు కావడం హై కోర్టు క్వాష్ పిటిషన్ లో బెయిల్ ఇవ్వడంతో హైకోర్టు నేరుగా సూపరింటెండెంట్ కు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *