
ప్రముఖ విలన్ శక్తి కపూర్ కుమార్తెగా పుట్టినా, శ్రద్ధా కపూర్ తన ప్రతిభతో బాలీవుడ్‌లో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. అందం, అభినయం, సున్నితమైన స్వభావంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 38 ఏళ్ల వయసులో కూడా సింగిల్ లైఫ్ ను ఆస్వాదిస్తూ, తరచూ డేటింగ్ రూమర్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు.
2010లో “తీన్ పట్టి” తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రద్ధా, 2013లో విడుదలైన “ఆషికి 2” తో స్టార్ హీరోయిన్‌గా మారారు. ఆ తర్వాత “ఏక్ విలన్”, “ABCD 2”, “బాఘి”, “స్త్రీ” వంటి ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి, తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే, ఆమె వ్యక్తిగత జీవితం ఎక్కువగా హాట్‌టాపిక్‌గా మారుతోంది. ఆదిత్య రాయ్ కపూర్, ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ, స్క్రీన్ రైటర్ రాహుల్ మోడీ వంటి పేర్లతో శ్రద్ధా డేటింగ్ రూమర్లు వచ్చాయి.
ప్రస్తుతం “స్త్రీ 2” సహా, పలు పెద్ద బడ్జెట్ చిత్రాలతో శ్రద్ధా బిజీగా ఉన్నారు. అభిమానులు ఆమె పెళ్లి గురించి ఎన్నో ఊహాగానాలు చేస్తూనే ఉన్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన “సాహో” చిత్రంలో నటించిన ఆమె, ఆ సినిమాతో దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారు.
శ్రద్ధా కపూర్ టాలెంట్, కష్టపడే ధోరణి, అందంతో బాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మరి, పెళ్లి ఎప్పుడో? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూనే ఉన్నారు.