దయచేసి చప్పట్లు కొట్టొద్దు – శ్రేయా ఘోషల్‌ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

పశ్చిమ బెంగాల్‌ లో జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్‌ గతంలో తన కాన్సర్ట్‌ను వాయిదా వేసుకున్నారు. అయితే, తాజాగా ఆ కాన్సర్ట్‌ను శ్రేయా ఘోషల్‌ నిర్వహించారు. ‘ఆల్‌ హార్ట్స్‌ టూర్‌’లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు..’ అంటూ సాగే పాటను శ్రేయా ఘోషల్‌ ఉద్వేగభరింతగా ఆలపించారు.

శ్రేయా ఘోషల్‌ ఇంకా ఎమోషనల్ గా మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎదుర్కొనే బాధ, వారి ఆవేదనను ఆమె ఈ పాట రూపంలో వినిపించారు. ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టొద్దని ఆడియన్స్‌ను శ్రేయా ఘోషల్‌ కోరారు. శ్రేయా ఘోషల్‌ పాట పాడడం పూర్తయ్యాక స్టేడియం మొత్తం ‘వీ వాంట్‌ జస్టిస్‌’ నినాదాలతో హోరెత్తింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

The post దయచేసి చప్పట్లు కొట్టొద్దు – శ్రేయా ఘోషల్‌ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *