Mon. Oct 13th, 2025
OG : ఓజీ’లో తన పాత్రపై ఎమోషనల్ కామెంట్స్ చేసిన శ్రియా రెడ్డి!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా “ఓజీ” రేపటి నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఎంటర్‌టైనర్‌లో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటించగా, సలార్ ఫేమ్ శ్రియా రెడ్డి కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆమె తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

Also Read : Ananthika : సందీప్ వంగా మూవీలో ఛాన్స్ కొట్టేసిన..8 వసంతాలు ఫేమ్ అనంతిక!

“నా పాత్రలో భావోద్వేగాలు, శక్తి రెండూ కలిపి ఉంటాయి. దాంతో వచ్చే ఇంపాక్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ రోల్‌లో ఉన్న లోతు దానిని మరింత రా, ఇంటెన్స్‌గా మార్చింది. ముఖ్యంగా నేను పూర్తిగా మేకప్ లేకుండా నటించాను. ఇది సినిమాటోగ్రాఫర్ రవి కె. చంద్రన్ ఆలోచన. ఆయన పాత్ర సహజంగా, రియలిస్టిక్‌గా కనిపించాలని కోరుకున్నారు. నాకు కూడా ఆ విజన్ నచ్చడంతో వెంటనే అంగీకరించాను” అని శ్రియా తెలిపారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించిన అనుభవం గురించి మాట్లాడుతూ.. “ఆయన చాలా తక్కువ మాటలు మాట్లాడుతారు. నేను అలానే ఉంటాను. ఆయన రాజకీయ పనులు పక్కనబెట్టి షూటింగ్‌కి వస్తారని నాకు తెలుసు. అందుకే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా నా పని పైన దృష్టి పెట్టాను. అయితే సెట్‌లో సినిమాకి సంబంధం లేని అనేక విషయాలు మేము చర్చించుకున్నాం. ఆయనతో పనిచేయడం నాకు ఒక మంచి అనుభవం” అని ఆమె అన్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.