
శ్రుతి హాసన్ ప్లాస్టిక్ సర్జరీపై ధైర్యంగా స్పందించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె తన ముక్కు సర్జరీ గురించి అంతా నిజం చెప్పేశారు. ఫిల్లర్స్, కాస్మెటిక్ మార్పులు చేయించుకున్న విషయాన్ని ఆమె అంగీకరించారు.
“హౌటర్ఫ్లై షో” మరియు “ది మేల్ ఫెమినిస్ట్” ఇంటర్వ్యూల్లో, శ్రుతి తన తొలిచిత్రం సమయంలో ముక్కు విరిగిందని, దాన్ని సరిచేయించుకునే అవకాశం వచ్చింది కాబట్టి కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్నానని చెప్పారు. అయితే, కొందరు ఇది ఓ సాకే అని విమర్శించారు.
దానికి శ్రుతి హాసన్ కటువుగా స్పందిస్తూ, “ఇది నా శరీరం, నా ఇష్టం. నా గురించి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.” అని స్పష్టంగా చెప్పారు. సోషల్ మీడియాలో ఆమె ధైర్యమైన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కొంతమంది ఆమె సౌందర్య మార్పులపై ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే శ్రుతి తన నిర్ణయంపై ఖచ్చితంగా ఉన్నారు. “నేను నన్ను నేను ప్రేమించుకుంటాను. నేను ఏది కావాలనుకున్నా, అదే చేస్తాను” అని ఆమె చెప్పుకొచ్చారు.
శ్రుతి హాసన్ చివరిసారిగా “సలార్” చిత్రంలో ప్రభాస్ సరసన కనిపించారు. సినిమా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంటూ, వివాదాలకు, విమర్శలకు భయపడకుండా ముందుకు సాగుతున్న ఈ బ్యూటీకి మరింత ఆదరణ లభిస్తోంది.