Rashmika–Salman’s Action Thriller Sikandar Now Streaming on Netflix

సల్మాన్ ఖాన్ – రష్మిక మందన్న జంటగా నటించిన “సికిందర్” సినిమా నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు చేసింది. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ఇప్పుడు ఓటీటీకి వచ్చేసింది. మే 25 అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా “సికిందర్” స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

ఈ సినిమా థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదల కాగా, ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *