
ప్రముఖ గాయని కల్పన ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేసి, తన గురించి వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరింది. కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని, తన భర్త ప్రసాద్ ప్రభాకర్ వల్లే ఈరోజు తాను బ్రతికున్నానని తెలిపింది. భర్త సపోర్ట్‌తో PG, LLB చదువుతున్నానని చెప్పిన ఆమె, సింగింగ్ కెరీర్ కొనసాగిస్తూ చదువుల ఒత్తిడితో నిద్ర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వివరించింది. డాక్టర్ల సూచన మేరకు నిద్ర మాత్రలు వాడుతున్నానని చెబుతూ, త్వరలోనే కొత్త పాటలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని వెల్లడించింది. అలాగే, పోలీసులు, మీడియా, తోటి గాయకులు అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపింది.
ఇదిలా ఉండగా, కొద్ది రోజుల క్రితం కొచ్చి నుంచి వచ్చిన కల్పన, అప్రమత్తంగా మించిన నిద్ర మాత్రలు తీసుకుంది. అనంతరం భర్తకు ఫోన్ చేసి, ఎంత మాత్రలు తీసుకున్నానో తెలియదు అని చెప్పి కాల్ కట్ చేసింది. ఆందోళన చెందిన భర్త, అపార్ట్మెంట్ సెక్రటరీకి సమాచారం ఇచ్చి పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా, స్టమక్ వాష్ చేసి వెంటిలేటర్ పై ఉంచారు. మరుసటి రోజు కల్పన స్పృహలోకి వచ్చింది.
కేరళ నుంచి కూతురు దయా ప్రసాద్, భర్త ప్రసాద్ వచ్చి పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చిన దయా ప్రసాద్, కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవని, ఒత్తిడితో తల్లి నిద్ర మాత్రలు వాడిందని వెల్లడించింది.
ప్రస్తుతం కల్పన ఆరోగ్యంగా ఉన్నట్లు, త్వరలోనే సంగీత ప్రస్థానాన్ని తిరిగి ప్రారంభిస్తానని వీడియో ద్వారా తెలియజేశారు. ప్రముఖ గాయని తిరిగి తన కెరీర్‌ను ఎలా కొనసాగిస్తుందో చూడాలి!