కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఎమోషనల్ డ్రామా సిరెన్ ఓటీటీలోకి వస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమాలో జయం రవి హీరోగా నటించారు. అనుపమ పరమేశ్వరన్ మరో కీ రోల్ చేసింది. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళంలో ఫిబ్రవరిలో రిలీజైంది.

సిరెన్ థియేటర్స్ లో ప్రేక్షకాదరణ పొంది మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ సినిమాకు రెస్పాన్స్ బాగుంటుందని ఆశిస్తున్నారు. హిందీ తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సిరెన్ డిస్నీ ఫ్లస్ హాస్ స్టార్ లో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ మూడు తమిళ సినిమాలతో పాటు లేడీ జాన్ అనే బాలీవుడ్ మూవీలోనూ నటిస్తోంది.