ఉగాది సందర్భంగా రవితేజ హీరోగా నటిస్తున్న అనౌన్స్ చేశారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించనుంది. ఇది రవితేజ నటిస్తున్న 75వ సినిమా కావడం విశేషం. సామజవరగమన సినిమాకు కథను అందించిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పక్కా హైదరాబాద్ బేస్డ్ తెలంగాణ నేపథ్య కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.

ఈ పోస్టర్ లో హీరో క్యారెక్టర్ పేరు లక్ష్మణ్ భేరి అని పరిచయం చేశారు. ఉగాది కాబట్టి అతని జాతకాన్ని పోస్టర్ లో రాశారు. ఆదాయం చెప్పన్ తియ్ అని, వ్యయం లెక్క జెయ్యన్ అని, రాజపూజ్యం అన్ లిమిటెడ్ అని, అవమానం జీరో అని రాశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈసారి కంప్లీట్ ఎంటర్ టైనర్ మూవీలో రవితేజ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.