ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం భారీ డిమాండ్ ఉంది. నార్త్ లో కరణ్ జోహార్, అనిల్ కలిసి రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కోసం క్రేజ్ ఏర్పడింది. చివరకు దేవర హక్కులు సితార డిస్ట్రిబ్యూషన్ చేతికి దక్కినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ లియో సినిమాతో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టింది.

సొంత చిత్రాలతో పాటు కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసింది. ఇప్పుడు దేవరతో ఆ సంస్థ బిగ్ స్టెప్ వేసినట్లు అనుకోవాలి. దేవరను సితార డిస్ట్రిబ్యూషన్ సంస్థ దాదాపు 120 కోట్ల రూపాయలకు తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది మంచి ఆఫర్ అనుకోవచ్చు. ఈ సినిమా మీదున్న హైప్ తో వసూళ్లు వర్కవుట్ అవుతాయని ఈ సంస్థ భావిస్తోంది. రెండు భాగాలుగా దేవర సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.