- త్వరలో ప్రేక్షకుల ముందుకు గేమ్ చేంజర్
- కథానాయకుడిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
- ఈ సినిమాపై ఎస్ జే సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇందులో సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించింది. మరో రెండు వారాల్లో ఈ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ థియేటర్లోకి రాబోతోంది. జనవరి 10న మెగా ఫ్యాన్స్‌కు అసలు సిసలైన సంక్రాంతి మొదలు కానుంది. ఈ సినిమాపై చిత్రయూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. తాజాగా ప్రముఖ నటుడు ఎస్ జే సూర్య ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
READ MORE: Bombay High Court: ఒక్కసారి మాత్రమే అమ్మాయిని ఫాలో అవ్వడం వేధించడం కాదు..
‘గేమ్ చేంజర్’లో అవకాశం ఏలా వచ్చిందనే అంశంపై ఎస్ జే సూర్య వివరణ ఇచ్చారు. డైరెక్టర్ శంకర్ తనకు అవకాశం కల్పించినట్లు తెలిపాడు. తన పర్ఫామెన్స్ కి దర్శకుడు ఇంప్రెస్ అయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో నటనను చూసే తనకు ఇండియన్ 2లో అవకాశం ఇచ్చినట్లు వెల్లడించాడు.
“రామ్ చరణ్ అద్భుతమైన నటుడని.. ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తారన్నాడు. ఐఏఎస్ ఆఫీసర్‌గా ఎంతో హుందాగా కనిపిస్తారని.. అప్పన్న పాత్ర అయితే లైఫ్ టైం గుర్తుండిపోతుందన్నాడు. ఈ సినిమాలో పని చేస్తున్నప్పుడు తనలో ఉన్న దర్శకుడు బయటకు వచ్చాడా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్లేయర్‌గా ఆడుతున్నప్పుడు ఆట మీద దృష్టి పెట్టాలి. పక్క చూపులు చూడకూడదు. నటుడిగా ఉన్నప్పుడు కేవలం నటుడిగానే ఆలోచించాల అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.శంకర్ గారికి సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయి తనకు లేదని.. రాజమౌళిలే శంకర్ గారి గురించి గొప్పగా చెప్పారని గుర్తు చేశాడు.
READ MORE: BRS : సోమవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్
“డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మా ఈవెంట్‌కు రావడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నా గురించి మాట్లాడుతూ ఉంటే నాకు చెప్పలేని ఆనందం కలిగింది. నోట మాట రాలేదు. ఆయన్ను హత్తుకున్నప్పుడు నాకు తెలియని ఆనందం కలిగింది. ఖుషీ టైంలో ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పుడే ఆయన ఐడియాలజీ గురించి చెబుతుండేవారు. కానీ నాకు అప్పుడు ఆ విషయాలు అర్థం కాలేదు. ఇప్పుడు ఆయన ఐడియాలజీ అందరికీ తెలుస్తోంది. ఆయన ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు. నిజాయితీగా కష్టపడే వారిని ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు.” అని ఎస్ జే సూర్య పవన్ కళ్యాణ్‌ని కొనియాడారు. ఓ నిజాయితీగా ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీత పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే వార్‌ను గేమ్ చేంజర్‌లో చూపిస్తారని కుండబద్దలు గొట్టాడు.