Published on Nov 21, 2024 9:00 PM IST
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ తెరకెక్కి్స్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌కి చేరుకున్నాయి. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయన తాజాగా తన పాత్రకు సంబంధించి, ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను తెలిపాడు.
ఈ సినిమాలో తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్‌ను ఆయన తాజాగా పూర్తి చేసుకున్నాడట. ఈ మూవీలోని రెండు ప్రధానమైన సీన్స్‌కి ఆయన గత మూడు రోజుల్లో డబ్బింగ్ కంప్లీట్ చేశానని.. ఈ రెండు సీన్స్‌లో ఒకటి రామ్ చరణ్‌తో.. మరొకటి శ్రీకాంత్‌తో ఉంటుందని.. ఈ రెండు సీన్స్ కూడా అద్భుతంగా వచ్చాయని.. ఈ సీన్స్‌తో పోతారు.. మొత్తం పోతారు.. అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, శ్రీకాంత్, అంజలి, సునీల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించగా, దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Hi friends , I just finished dubbing of two vital scenes in #GAMECHANGER (one with our Global star @AlwaysRamCharan garu & another with Srikant garu … it took 3 whole days to finish these 2 scenes dubbing …. The out put came out like “ dheenamma dhimma thirigi bomma…
— S J Suryah (@iam_SJSuryah) November 21, 2024