వైరల్ అవుతున్న శోభితా ప్రీవెడ్డింగ్ పిక్స్ ! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 2, 2024 7:00 PM IST

హీరో నాగచైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల పెళ్లి పీటలెక్కనున్న విషయం తెలిసిందే. వీరి వివాహం ఈనెల 4న హైదరాబాద్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెళ్లికి ముందు తంతు ఘనంగా జరిగింది. ఇప్పటికే సంప్రదాయబద్ధంగా మంగళ స్నానాలు జరిగాయి. ఈ మంగళ స్నానాలకు సంబంధించిన శోభితా ధూళిపాళ్ల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అదేవిధంగా శోభితా ధూళిపాళ్లను పెళ్లి కూతురు చేయగా ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను కూడా నిర్వాహకులు షేర్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన సెట్‌లో నాగచైతన్య – శోభితా ధూళిపాళ్ల వివాహం జరగబోతుంది. అన్నట్టు ఈ క్రమంలో తనకు కాబోయే సతీమణి, నటి శోభితా ధూళిపాళ్ల గురించి మాట్లాడుతూ.. తన జీవితంలో ఏర్పడిన వెలితిని ఆమె పూర్తి చేస్తుంది అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *