లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు విజయ్ దేవరకొండకు. ఈ సినిమాలతో రౌడీ ఫ్యాన్స్ సాటిస్ఫై అవలేదు. రెండు సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. దీంతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Daaku Maharaaj : ‘డాకు మహారాజ్’ USA బుకింగ్స్ ఓపెన్
దేవరకొండ అగ్రెసివ్ లుక్‌తో అదరగొట్టాడు. షార్ట్ హెయిర్ కట్ మరియు గడ్డంతో కనిపించాడు రౌడీ. ఎప్పటి నుండో ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా గతంలోనే వార్తలు రాగా ఇప్పుడు నాగవంశీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ వీడీ12 ప్రాజెక్ట్ రెండు పార్టులుగా రాబోతుందని తెలిపాడు. అయితే ఈ ఆలోచన సినిమా తీస్తున్న తీస్తున్న టైంలో రాలేదని షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే వచ్చిందని అన్నాడు. అందుకే ఫస్ట్ పార్ట్ పై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదని ఈ రెండు పార్టుల కథలు కూడా వేరు వేరుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సెకండ్ పార్ట్ చేసిన, చేయకపోయిన ఎలాంటి ప్రాబ్లమ్ లేదని కూడా అన్నాడు. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తైందని వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ ఆ టైంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఉంటే.. తమ సినిమాను వాయిదా వేయనునట్లు చెప్పుకొచ్చాడు.