Published on Jan 4, 2025 10:04 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పడుకోణ్ అలాగే హీరోయిన్ దిశా పటాని ఫీమేల్ లీడ్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం 1100 కోట్లకు పైగా గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా లేటెస్ట్ గా జపాన్ మార్కెట్ లో కూడా రిలీజ్ కి వెళ్ళింది. అయితే జపాన్ లో ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉందని అందరికీ తెలిసిందే.
అలా ప్రభాస్ హీరోగా నటించి అక్కడ విడుదలకి వెళ్లిన అన్ని సినిమాలకి మంచి ఆదరణ దక్కింది. అయితే ఇపుడు కల్కి 2898 ఎడి కి కూడా అక్కడ మొదటి రోజే సాలిడ్ వెల్కమ్ దక్కినట్టుగా తెలుస్తుంది. జపాన్ లో మొదటి రోజు 3700కి పైగా ఫుట్ ఫాల్స్ పడినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇది ఇండియన్ సినిమాల్లో ఆల్ టైం టాప్ 3 అన్నట్టుగా తెలుస్తుంది. ఇలా మొత్తానికి అయితే కల్కి సినిమాకి అక్కడ కూడా సాలిడ్ వెల్కమ్ దక్కింది అని చెప్పి తీరాలి