- అక్షయ్ కుమార్ ఫన్ మూవీ హౌస్ ఫుల్ 5తో ఎంట్రీ
- బాఘీ4లో టైగర్ ష్రాఫ్‌తో రొమాన్స్
- పంజాబీలో మరో ఫ్రాంచైజీ మూవీ చేస్తోన్న బజ్వా
పంజాబ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ బజ్వా అప్పుడప్పుడు పొరుగు ఇండస్ట్రీల్లో కూడా తన లక్ పరీక్షించుకుంది. తమిళంలో ఓ రెండు, తెలుగులో ఓ రెండు సినిమాలు, హిందీలో స్పెషల్ సాంగ్స్ అండ్ క్యామియోస్ చేసిందీ కానీ ఛాన్సులు క్యూ కట్టలేదు. చేసేదేమీ లేక బ్యాక్ టు ఓన్ ఇండస్ట్రీ. ఎంత సేపని ప్రాంతీయ భాషా చిత్రాల్లో నెట్టుకొస్తామని అనుకుందో ఏమో.. ఈ సారి బాలీవుడ్‌పైనే దండయాత్ర స్టార్ట్ చేసి సక్సీడ్ అవుతోంది. అక్కడ వరుసగా గోల్టెన్ ఛాన్సులు ప్యాక్ చేసేసుకుంటోంది.
సోనమ్ బజ్వాది అలాంటి ఇలాంటి లక్కీ ఛాన్స్ కాదు. బాలీవుడ్ ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండా మరో బిగ్ ప్రాజెక్టును తన ఖాతాలో వేసేసుకుంది. అక్షయ్ కుమార్ హిట్ సిరీస్ హౌస్ ఫుల్ 5లో నటించే ఛాన్స్ తో పాటు టైగర్ ష్రాఫ్ సక్సెస్ ఫుల్ ప్రాంచైజీ నుండి వస్తోన్న బాఘీ4లో యాక్షన్ హీరోతో రొమాన్స్ చేసే అవకాశాన్ని చేజిక్కించుకుంది. రీసెంట్లీ టైగర్ ష్రాఫ్, సంజయ్ దత్ పోస్టర్లను రిలీజ్ చేసి సినిమాపై ఇంటెన్స్ క్రియేట్ చేసింది యూనిట్. కన్నడ డైరెక్టర్ ఏ హర్ష ఫస్ట్ టైం బాలీవుడ్ హీరోను డీల్ చేయబోతున్నాడు. ఈ ఏడాది బీమాతో గోపీచంద్‌కు డిజాస్టర్ ఇచ్చాడు హర్ష. బాఘీ 4 నెక్ట్స్ ఇయర్ సెప్టెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. సోనమ్ ఖాతాలో చేరిన ఈ రెండు ప్రాజెక్టులు కూడా ఫ్రాంచైజీ చిత్రాలే కావడం విశేషం. ఇదే కాదు పంజాబీలో చేస్తున్న నిక్కా జైల్దార్ 4 కూడా హిట్ సిరీస్‌లోని భాగమే. ఇలా ఫ్రాంచైజీ చిత్రాలను చేజిక్కించుకున్న ఈ పంజాబ్ గుడియా బాలీవుడ్‌లో లక్కీ గర్ల్‌గా మారుతుందేమో చూడాలి.