Sonu Sood:”నాకు కూడా సీఎం ఆఫర్ వచ్చింది”.. రాజకీయరంగ ప్రవేశంపై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు

  • నాకు కూడా సీఎం ఆఫర్ వచ్చింది
  • కనీసం డిప్యూటీ సీఎం అవ్వండి అని అడిగారు
  • కానీ నేను నిరాకరించాను
  • రాజకీయ రంగ ప్రవేశంపై సోనూ వ్యాఖ్యలు

2020 కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో నటుడు సోనూ సూద్ దేశవ్యాప్తంగా వలస కూలీలు, పేదలకు చేసిన సాయం అందరికీ తెలిసిందే. తన ఆస్తిని తనఖా పెట్టి దేశ, విదేశాలలో చిక్కుకుపోయిన చాలా మందిని సొంత స్థావరాలకు చేర్చాడు. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలివుడ్ యాక్టర్ రాజకీయాల్లోకి వస్తాడని అందరూ అనుకున్నారు. అయితే తాజాగా.. సోనూ తన రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లడాడు. తన కొత్త చిత్రం ‘ఫతే’ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ సమయంలో భాగంగా నటుడు మరోసారి రాజకీయాల్లో చేరడం గురించి సమాధానమిచ్చాడు.

READ MORE: CPI Narayana: సినీ ప్రముఖులతో సీఎం సమావేశం.. సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

సోనూసూద్ మాట్లాడుతూ.. “నాకు కూడా సీఎం ఆఫర్ వచ్చింది. నేను నిరాకరించడంతో డిప్యూటీ సీఎం అవ్వండి అని అడిగారు. జాతీయ నాయకులు నాకు రాజ్యసభ సభ్యునిగా కూడా అవకాశం కల్పిస్తామన్నారు. నువ్వు కచ్చితంగా రాజ్యసభకు రావాలి అని చెప్పారు. కానీ.. నేను దీనికి నిరాకరించాను. మీరు ఒక్కసారి పాపులర్ అయితే.. జీవితంలో పైకి ఎదగడం గురించి ఆలోచిస్తారు. పైకి వెళ్లిన కొద్ది ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది.” అని సోనూ సమాధానమిచ్చాడు.

READ MORE: MT Vasudevan Nair: ప్రముఖ మలయాళ రచయిత, దర్శకుడు వాసుదేవన్ కన్నుమూత..

ఇదిలా ఉండగా..1999లో సోనూసూద్ ‘కల్లగర్’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. 2009లో విడుదలైన ‘అరుంధతి’ సినిమా ఆయన క్రేజ్ ను పెంచేసింది. ఈ సినిమాలో పశుపతి అనే విలన్‌ పాత్రలో నటించి మెప్పించాడు. తెలుగులో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించాడు సోనూ సూద్ . ఆ తర్వాత హిందీలో ‘దబాంగ్‌’, ‘జోధా అక్బర్‌’తో పాటు పలు సినిమాలు చేశాడు. అలాగే కన్నడ ఇండస్ట్రీలోనూ కొన్ని సినిమాలు చేశారు. ఇక కోవిడ్ సమయంలో చాలా మందికి సహాయం చేశాడు. సోనూ సూద్ తన ఛారిటీ ద్వారా చాలా మందికి సహాయం అందించాడు. ఇప్పటికీ ఆయన సాయం చేస్తూ ప్రజలను ఆడుకుంటున్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *