
భారత క్రికెట్‌ను కొత్త దిశగా తీసుకెళ్లిన సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) బయోపిక్ గురించి కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది. ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ పై ఊహాగానాలు ఉన్నాయి. అయితే తాజాగా స్వయంగా గంగూలీనే (Ganguly Himself) ఓపెన్ అయ్యారు. ఆయన ప్రకారం, రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) ప్రధాన పాత్ర పోషించనున్నాడు. అయితే షెడ్యూల్ సమస్యల వల్ల ఈ సినిమా మరో ఏడాది (One More Year) ఆలస్యం అయ్యే అవకాశముంది.
సౌరవ్ గంగూలీ పాత్ర కోసం పలువురు ప్రముఖ నటుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. మొదట రణబీర్ కపూర్ (Ranbir Kapoor), ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) పేర్లు వినిపించాయి. కానీ చివరకు రాజ్‌కుమార్ రావుకే ఛాన్స్ (Rajkummar Got the Role) దక్కింది. గతంలో ‘శ్రీకాంత్’ (Srikanth) సినిమాలో అద్భుత నటన కనబరిచిన రాజ్‌కుమార్, ఇప్పుడు ఈ క్రికెట్ బయోపిక్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
కాగా, రాజ్‌కుమార్ రావు గతేడాది ‘స్త్రీ 2’ (Stree 2) లో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ₹800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్ లో రికార్డులు తిరగరాసింది. అలాగే పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా (Srikanth Bolla) జీవితం ఆధారంగా రూపొందిన ‘శ్రీకాంత్’ సినిమాతోనూ విశేష గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ క్రికెట్ బయోపిక్‌లో భారత క్రికెట్ చరిత్రలో గొప్ప నాయకుడిగా (India’s Great Captain) గుర్తింపు పొందిన దాదా (Dada) పాత్రను ఎలా పోషిస్తాడో చూడాలి. త్వరలోనే చిత్రబృందం షూటింగ్ వివరాలు, రిలీజ్ డేట్ (Release Date) లాంటి సమాచారం బయటపెట్టనుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం వేచిచూడం