
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా? టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో క్రేజీ ఫాలోయింగ్ ఉన్న నటి తమన్నా భాటియా. పిలకలతో ఉన్న ఆమె బాల్యపు ఫోటో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. అభిమానులు “ఇది తమన్నా కాదేమో?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా తమన్నా ఓదెల 2 అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె లేడీ అఘోరి పాత్రలో కనిపించనుంది. సాధారణంగా గ్లామర్ పాత్రల్లో కనిపించే తమన్నా, ఈసారి భిన్నమైన రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో ఆమె చురుగ్గా పాల్గొంటోంది.
ఇంతకు ముందు హిందీలో వచ్చిన Lust Stories 2 అనే OTT వెబ్ సిరీస్ లో తమన్నా హాట్ అండ్ రొమాంటిక్ సీన్లతో ఆకట్టుకుంది. విజయ్ వర్మతో కలిసి ఆమె చేసిన రొమాన్స్ ఎపిసోడ్ ఎంతో సంచలనం రేపింది. ఆ సిరీస్ షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య సన్నిహితత పెరిగి ప్రేమగా మారింది. కొంతకాలం బాలీవుడ్ ఈవెంట్స్, పార్టీల్లో వీరిద్దరూ కలిసే కనిపించారు.
కానీ ఇప్పుడు వారి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో విజయ్ వర్మ గురించి పరోక్షంగా ఓ ప్రశ్న వచ్చినపుడు తమన్నా తనదైన స్టైల్ లో స్పందించి, బ్రేకప్ వార్తలను బలపరిచింది. ప్రస్తుతం తమన్నా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది, ఫోటోలు, వీడియోలతో నెటిజన్లను అలరిస్తోంది. ఆమె తాజా పోస్టులు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి.