ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే పుష్ప 2. దర్శకుడు సుకుమార్ తో చేసిన ఈ క్రేజీ అండ్ మ్యాడ్ సీక్వెల్ కోసం అభిమానులు పాన్ ఇండియా ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూడగా ఎట్టకేలకు సినిమా థియేటర్స్ లో పడిపోయింది.
మరి నిన్న పైడ్ ప్రీమియర్ లతోనే పుష్ప మాస్ జాతర మొదలు కాగా గతంలో పార్ట్ 1 కి బన్నీ ఏ రకంగా తన పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేసాడో ఈసారి అంతకు మించి అందించాడు అని చెప్పడంలో సందేహం లేదు. మెయిన్ గా అల్లు అర్జున్ నటనా విశ్వరూపం సినిమాలో ఎవరి కళ్ళు తిప్పుకొనివ్వకుండా చేస్తుంది.
ఆ జాతర సీక్వెన్స్ కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో తన ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ పెర్ఫామెన్స్ లు గాని అల్లు అర్జున్ కి స్పెషల్ అప్లాజ్ ని తీసుకొస్తాయి అలాగే ఈసారి కూడా డెఫినెట్ గా నేషనల్ అవార్డ్ బన్నీకి వచ్చినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి. ఆ రేంజ్ లో బన్నీ ఈ సినిమాకి ప్రాణం పెట్టేసాడు.
The post అల్లు అర్జున్ విశ్వరూపానికి స్పెషల్ అప్లాజ్..మళ్లీ నేషనల్ అవార్డ్ ఖాయమా? first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.