- ఏప్రిల్ 10న విడుదల కానున్న ది రాజాసాబ్
- 80శాతం మేర పూర్తయిన సినిమా షూటింగ్
- క్లైమాక్స్ షూట్ కోసం అద్భుతమైన మహల్ సెట్
The Rajasaab : ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాల సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ నుంచి వస్తున్న చిత్రం ది రాజాసాబ్. కమర్షియల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు మారుతీ టీమ్ కృషి చేస్తోంది. అయితే సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Read Also:Dead Body in Parcel: చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు!
ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వచ్చే షెడ్యూల్ లో ఈ సినిమా క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారని.. ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఓ స్పెషల్ మహల్ సెట్ ను వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్పెషల్ మహల్ సెట్ లోనే ‘ది రాజా సాబ్’ క్లైమాక్స్‌లోని కీలక భాగాన్ని షూట్ చేస్తారట. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ మూడ్రోజుల కిందట అధికారికంగా ప్రకటించింది.
Read Also:GameChanger : పోకిరి, ఒక్కడు లాంటి మాస్ ఎంటర్టైనర్ ఈ గేమ్ ఛేంజర్ : శంకర్