తన రీరిలీజ్ లపై మహేష్ ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 16, 2024 10:01 AM IST

దర్శకధీరుడు రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఐతే, ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక పై రాజమౌళి కసరత్తులు చేస్తున్నారట. మరోవైపు లొకేషన్స్ ను జక్కన్న ఇప్పటికే ఫైనల్ చేశారట. ఇక కొన్ని స్పెషల్ లొకేషన్స్ కోసం ప్రత్యేకంగా సెట్స్ ను వేయనున్నారు. ఇందులో భాగంగానే మహేష్ ఇంట్రో కోసం ప్రత్యేకంగా ఓ లొకేషన్ ను డిజైన్ చేసి, భారీగా సెట్ వేస్తారట.

మొత్తానికి ఈ సినిమా పై ఏదొక రూమర్ వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్ పాత్రలో నటిస్తోందని పుకార్లు వినిపించాయి. కాగా ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కు పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్ట్ ను రాశాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ సినిమా ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *